జనాజ పద్ధతి

జనాజ. మృత దేహానికి స్నానం చేయించటం, ఖననం చేయటం యొక్క ప్రాముఖ్యతలు

మృతుని స్నానం చేయించుట.

  1. మగవారు మగవారికి, స్త్రీలు స్త్రీలకి స్నానం చేయించవలెను.
  2. భార్య భర్తకి, భర్త భార్యకి స్నానం చేయించ వచ్చును.
  3. మృతుని యొక్క మర్మంగాలపై వస్త్రం కప్పి, మిగతా వస్త్రాలు శరీరం నుండి వేరు చేయవలెను.
  4. మీసాలు,గోళ్ళు, చెంక వెంట్రుకలు అతి పెద్దగా ఉంటే స్నానానికి ముందు కత్తిరించవలెను.
  5. వీపును కాస్త పైకి లేపి విసర్జన బయటకు వచ్చునట్లుగా కడుపును నొక్కవలెను. ఆతర్వాత బాగా కడుగవలెను. శుభ్రపరుస్తున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వాడవలెను.
  6. చేతికి తొడుగుళ్ళు తొడిగి విసర్జన కడుగవలెను.
  7. బాగా శుభ్రపరచిన తర్వాత వుదూ చేయించవలెను.
  8. ముందు కుడి ప్రక్కకు, ఆ తర్వాత ఎడమ ప్రక్కకు స్నానం చేయించవలెను.
  9. ఆతర్వాత రేగుచెట్టు ఆకుతో లేదా సబ్బుతో స్నానం చేయించవలెను. స్నానం ఒకసారి చేయించడం తప్పని సరి. 3 సార్లు చేయించడం సున్నహ్.
  10. ఇక చివరన కాపూర్ (కర్పూరం) నీళ్ళతో లేదా సువాసన ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో స్నానం చేయించవలెను.
  11. తప్పని సరిగా స్త్రీల వెంట్రుకలను మూడు జడలు చేయవలెను.

కఫన్ తొడిగించు

  1. మగవారికి 3 బట్టలలో కఫన్ ఇవ్వవలెను.
  2. కఫన్ శుభ్రముగా, తెల్లగా, సువాసన పూసినదై ఉండాలి.
  3. ఆడవారికి 5 బట్టలలో కఫన్ ఇవ్వవలెను.
  4. ఒక బట్టను నడుం క్రింద, ఒకటి భుజాల క్రింద, ఒకటి దుపట్టా మరియు రెండు పొడుగాటి బట్టలు ఉండాలి

కఫన్ పద్ధతి

  1. ముందుగా మూడు గట్టిగా ఉండే వస్త్రపు పట్టీలు పరచవలెను.
  2. మూడు పట్టీలపై మగవారి కోసం ఒకే సైజులోని 3 కఫన్ వస్త్రములు, స్త్రీల కోసమైతే 2 కఫన్ వస్త్రములు పరచవలెను.
  3. స్త్రీల కోసం కఫన్ వస్త్రంపై తల బయటికి తీయటానికి వీలుగా కత్తిరించఉన్న  ఇంకో చిన్న వస్త్రం పరచవలెను.
  4. స్త్రీల కోసం ఇంకో చిన్న వస్త్రము (నడుము నుండి కాళ్ళ వరకు సరిపోయేటట్లు) పరచవలెను.
  5. స్త్రీల కోసం ఇంకో చిన్న వస్త్రము తల కప్పేటట్లుగా పరచవలెను.
  6. చివరగా గుసుల్ చేయబడిన మృతదేహమును పైన పరచబడిన వస్త్రములపై పడుకోబెట్టి ఒక్కో వస్త్రమును చుట్టవలెను. ఆఖరుగా మొట్టమొదట పరచిన మూడు పట్టీలతో కఫన్ ను కట్టవలెను.

Read (చదవండి): జనాజ నమాజు చేయు విధానము

ఖననం చేయుట

  1. సమాధిలోతుగా మరియు అవసరమైనంత వెడల్పుగా ఉండాలి.
  2. సమాధి లహద్ లో త్రవ్వుట ఉత్తమం అంటే మృతదేహాన్ని లోపల దాచి పెట్టేంత లేదా అడుగు పెట్టె మాదిరిగా చొరియ ఖిబ్లావైపుకు త్రవ్వవలెను.
  3. సమాధిలో మృతదేహమును కాస్త కుడివైపు త్రిప్పి, ముఖం ఖిబ్లావైపు ఉండేటట్లు చేయవలెను.
  4. లహద్ (చొరియ)ని కాల్చని ఇటుకలు మరియు తడిచిన మట్టి గారతో పూడ్చి (సీలు చేసి) ఆ తర్వాత సమాధిని మట్టితో నింపవలెను.
  5. సమాధిని భూమినుండి ఒక జాన అంతట పైకి ఉండునట్లు మట్టికప్పి నీళ్ళు చల్లవలెను.

Source: ఫిఖ్ హ్ – రెండవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా