ఈద్ నమాజు

పండ నమాజు

  1. ఈదుల్ ఫిత్ ర్ (రమదాన్ పండగ) రమదాన్ నెల ఉపవాసములు పూర్తయిన తర్వాత షవ్వాల్ 1వ తారీఖున జరుపుకోబడును.
  2. ఈదుద్దుహా దిల్ హజ్జ 10వ తారీఖున జరుపుకోబడును.
  3. పండుగ నిర్వచనం: మాటిమాటికీ సంతోషసంబరాలతో మరలి వచ్చేది. పండగ రోజు సంతోషంగా తిని, తినిపించి అల్లాహ్ ను స్తుతించురోజు.

సలాతుల్ ఈద్ షరతులు:

  1. సమయం: సూర్యుడు ఉదయించిన 20 నిమిషాల తర్వాత సలాతుల్ ఈద్ సమయం ప్రారంభమగును. ఆలస్యం చేయకుండా ప్రారంభపు సమయంలోనే ఈద్ నమాజ్ పూర్తి చేయటం ఉత్తమమం
  2. సలాహ్: సలాతుల్ ఈద్ రెండు రకాతులు బిగ్గరగా చదవవలెను. అదాన్ మరియు ఆఖామహ్ పలుకబడదు. మొదటి రకాతులో ప్రారంభ తక్బీర్ కాకుండా 6 తక్బీర్ లు అధికంగా పలుక వలెను. మరియు రెండవ రకాతులో 5 తక్బీర్ లు పలుక వలెను.
  3. సలాతుల్ ఈద్ తర్వాత రెండు ఖుత్బాలు ఇవ్వబడును.

సలాతుల్ ఈద్ లోని సున్నతులు

  1. స్నానం చేయుట, మంచి దుస్తులు ధరించుట, సువాసన పూసుకొనుట.
  2. ఈదుల్ ఫితర్ లో బేసి సంఖ్యలో ఖర్జూరపు పళ్ళు తిని ఈద్ గాహ్ కు వెళ్ళుట. సలాతుల్ ఈద్ పట్టణం లేదా గ్రామం బయటకు వెళ్ళి ఆచరించుట సున్నహ్.
  3. ఈదుల్ అద్ హా లో ఈద్ గా నుంచి వచ్చి ఖుర్బాని మాంసంతో భోజనం చేయుట   ఈద్ గాహ్ వెళ్ళే టప్పుడు ఒకదారిన వచ్చే టప్పుడు వేరే దారిన రావటం.
  4.  తక్బీర్ – అల్లాహు అక్బర్, అల్లాహ్ అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్,  అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హంద్

(الله أكبر     الله أكبر     لا اله إلا الله،     والله أكبر     الله أكبر     ولله الحمد)

       గమనిక: తక్బీర్ ఒక్కొక్కరు వేర్వేరుగా పలకాలి. మూకుమ్మడిగా పలకరాదు.